పెళ్లి కాకుండానే తండ్రి కాబోతున్న పాండ్యా - MicTv.in - Telugu News
mictv telugu

పెళ్లి కాకుండానే తండ్రి కాబోతున్న పాండ్యా

May 31, 2020

 

Hrdik aPandya.

తాను తండ్రి కాబోతున్నట్ట భారత క్రికెటర్‌ హార్దిక్‌ పాండ్యా అభిమానులకు శుభవార్త చెప్పాడు.  తన ప్రేయసి నటాషా స్టాన్‌కోవిచ్‌ గర్భవతి అని సోషల్‌ మీడియాలో పంచుకున్నాడు. ఈ మేరకు నటాషాతో దిగిన తాజా ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌‌లో షేర్ చేశాడు. ‘తనతో జీవన ప్రయాణంలో కొత్త అనుభూతిని పొందుతున్నా. ఈ సంతోషకరమైన వార్తను పంచుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది’ అని పేర్కొన్నాడు. హర్దిక్‌ పోస్ట్‌కు స్పందించిన టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, కోచ్‌ రవిశాస్త్రీతో పలువురు క్రికెటర్లు‌ వారిద్దరికీ శుభాకాంక్షలు తెలిపారు.

అభిమానుల నుంచి కూడా శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. కాగా, ముంబైలో స్థిరపడ్డ సెర్బియా నటి, మోడల్‌ నటాషా స్టాన్‌కోవిచ్‌ను హార్దిక్‌ వివాహం చేసుకోనున్న విషయం తెలిసిందే. కొత్త సంవత్సరం వేడుకల్లో భాగంగా దుబాయ్‌లో వీరిద్దరు తమ నిశ్చితార్థం విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. అతి త్వరలోనే ఈ జంట వివాహం చేసుకోనున్నారు.