అసెంబ్లీ ఎన్నికలు.. ట్విటర్‌లో రికార్డు - MicTv.in - Telugu News
mictv telugu

అసెంబ్లీ ఎన్నికలు.. ట్విటర్‌లో రికార్డు

October 26, 2019

Twitter  .

మహారాష్ట్ర, హరియాణా అసెంబ్లీ ఎన్నికలు ముగిసాయి. రెండు రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. ఈ ఎన్నికలకు సంబంధించి ట్విటర్‌లో ఓ రికార్డు నమోదైంది. రెండు రాష్ట్రాల్లో ఎన్నికల సందర్భంగా 3.2 మిలియన్ల ట్వీట్లు చేశారని శుక్రవారం ఆ సంస్థ ప్రకటించింది. 

అర్థవంతమైన రాజకీయ వ్యాఖ్యలు చేయాలనుకొనే వారికి ట్విటర్‌ కేంద్రమైందని సంస్థ ఉన్నతాధికారి పాయల్‌ కామత్‌ తెలిపారు. ‘#AssemblyElections2019’ అనే హ్యాష్‌ ట్యాగ్‌తో 3.2 మిలియన్ల ట్వీట్‌లు చేయడం రికార్డన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజకీయ నాయకులు ట్విటర్‌ వంటి సోషల్ మీడియా సైట్లను ఉపయోగిస్తున్న సంగతి తెలిసిందే. ప్రజలు కూడా తమ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు, ఇతర అభిప్రాయాల గురించి నేరుగా రీట్వీట్లు చేస్తున్నారు.