twitter reviews on Yasoda movie. Yashoda movie
mictv telugu

సమంత ఖాతాలో మరో హిట్?

November 11, 2022

సమంతకి మళ్ళీ హిట్ పడింది. వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన యశోద సినిమాకి అప్పుడే రివ్యూస్ వచ్చేస్తున్నాయి. ఓవర్సీస్ లో మనకన్నా ముందే మూవీ రిలీజ్ అవడంతో ట్విట్టర్ లో రివ్యూలు వచ్చేస్తున్నాయి. ఇంటర్వెల్ వరకు కొంచెం సాగదీసినట్టు ఉన్నా…తర్వాత నుంచి ట్విస్ట్ లతో అదిరిపోయిందని చెబుతున్నారు. ఇంటర్వెల్ బ్యాంగ్ ఓ లెవల్ ఉందని ఎత్తిపడేస్తున్నారు.

సమంత యాక్షన్ గురించి అయితే చెప్పక్కర్లేదు అంటున్నారు రివ్యూవర్స్. ఎప్పటిలాగే చించిపడేసింది అంటున్నారు. సినిమాను ఒంటిచేత్తో నడిపించిందని చెబుతున్నారు. సినిమా కథ నచ్చకపోయినా సమంత కోసమైనా చూడొచ్చని అంటున్నారు. అలాగే మణిశర్మ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా మూవీని మరో లెవల్ కు తీసుకెళ్ళిందని రాస్తున్నారు.

యుఎస్ ప్రీమియర్స్ రిపోర్ట్ ప్రకారం సినిమాలో సమంత యాక్టింగ్ మరో లెవల్ అట. సరోగసీ బ్యాక్‌డ్రాప్‌తో కథ నడుస్తూ చివరికి ఓ మర్డర్‌తో థ్రిల్లర్‌గా మారుతుందని సినిమా చూసిన వాళ్లు చెప్తున్నారు. సినిమాలో సమంత ఎంట్రీ కూడా చాలా సింపుల్‌గా ఉందని.. వరలక్ష్మి శరత్ కుమార్, ఉన్ని ముకుందన్ చాలా బాగా యాక్ట్ చేసినట్లు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

ట్విట్టర్ రియాక్షన్స్ ఆధారంగా మూవీ ఎలా ఉందంటే?

రేప్ మర్డర్ మిస్టరీతో సినిమా ప్రారంభం అవుతుందట. అలానే సమంత ఎంట్రీ కూడా చాలా సింపుల్‌గా చూపించినట్లు నెటిజన్లు చెప్తున్నారు. సరోగసీ ఆసుపత్రిలో ఓ మర్డర్ ఇన్విస్టిగేషన్‌తో సినిమా మలుపు తిరుగుతుందని సినిమా చూసిన వారు ట్విట్టర్‌లో రాసుకొచ్చారు. ఇంటర్వెల్‌కి ముందు వచ్చే 20 నిమిషాల సన్నివేశాలు మూవీకి హైలైట్‌ అంటున్నారు. ఇంటర్వెల్ తర్వాత సినిమా థ్రిల్లర్‌గా మారిందని ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. ఈ సినిమాకి మణిశర్మ మ్యూజిక్ అందించగా.. బీజీఎం సూపర్‌గా ఉందని సినిమాకి అదే హైలైట్ అంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

మొత్తానికి సమంత మరో హిట్ కొట్టేలానే ఉంది. ఓ బేబీ తర్వాత వచ్చిన మరో లేడీ ఓరియెంటెడ్ మూవీ ఇది. దీని మీద మొదటి నుంచే అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. అసలే ఆరోగ్యం బాలేక సతమతమవుతున్న సమంతకు ఈ మూవీ హిట్ అయితే మంచి బూస్ట్ వస్తుంది.