ఎడిట్ ఆప్షన్ కావాలంటే మీరు ఆ పని చేయాల్సిందే.. ట్విటర్ ట్వీట్ - MicTv.in - Telugu News
mictv telugu

ఎడిట్ ఆప్షన్ కావాలంటే మీరు ఆ పని చేయాల్సిందే.. ట్విటర్ ట్వీట్

July 4, 2020

Twitter

కరోనా వైరస్‌తో ప్రపంచం యావత్తు పరేషాన్ అవుతోంది. ఇలాంటి సమయంలో మనందరం ఎంతో జాగ్రత్తగా ఉండాలని చాలామంది తగు సూచనలు సోషల్ మీడియా వేదికగా చేస్తున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియా సంస్థ ట్విటర్ ఓ కొత్త ఐడియాను ప్రవేశపెట్టింది.  ప్రజలు అందరూ ఫేస్‌ మాస్కులు ధరిస్తే ట్విటర్‌లో ‘ఎడిట్’ బటన్ ఆప్షన్ చేరుస్తామని వెల్లడించింది. ‘అందరూ ముఖాలకు మాస్కులు ధరిస్తే ట్విటర్‌లో ఎడిట్ బటన్ అందుబాటులోకి తీసుకొస్తాం’ అని ట్విటర్ సంస్థ ట్వీట్ చేసింది. 

గతంలో దీనిపై ట్విటర్ సహ వ్యవస్థాపకుడు కాజ్ డోర్సే మాట్లాడుతూ.. ‘ఎడిట్ బటన్‌ను కొందరు తప్పుగా వాడుకునే అవకాశం ఉంది. ఈ కారణంగా ట్విటర్‌లో ఈ సదుపాయం కల్పించడం మాకు ఇష్టంలేదు. అసలు ఎప్పటికీ ఎడిట్ బటన్ ఆలోచన చేసే అవకాశం కూడా లేదు’ అని పేర్కొంది. కాగా, ట్విటర్‌లో ఒకసారి పోస్ట్ చేస్తే చాలు.. దాన్ని ఎడిట్‌ చేసే అవకాశం ఉండదు. ట్వీట్‌ మొత్తాన్ని డిలీట్‌ చేసి మళ్లీ కొత్త ట్వీట్‌ని చేయాల్సి ఉంటుంది. దీంతో ఇందులో ఎడిట్‌ ఆప్షన్ ఇవ్వాలని వినియోగదారులు ఎప్పటినుంచో సంస్థను కోరుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ట్విటర్‌ సంస్థ యూజర్లకు శుభవార్త చెప్పినంత పనే చేసింది. దానికి మాస్కుతో ముడిపెట్టింది. చూడాలి మరి ట్విటర్ మాస్కు గడ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో.