ఫామ్ లేమితో సతమతమవుతూ విమర్శకుల నోళ్లకు పనిచెప్తున్నాడు ఒకప్పటి రన్ మెషీన్ విరాట్ కోహ్లీ . ఇంగ్లండ్‌తో మూడో వన్డేలోనూ కోహ్లి మరోసారి విఫలం కావడంతో ఈసారి ట్రోల్స్ మరింత ఎక్కువయ్యాయి. దీనికి తోడు మ్యాచ్ జరిగిన మరుసటి రోజే ఓ యాడ్‌కు సంబంధించిన వీడియో షేర్ చేసిన కోహ్లి.. ట్రోలర్స్‌కు మరింత పనిచెప్పాడు. మాంచెస్టర్ వేదికగా ఆదివారం(జూలై 17) ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో కోహ్లి.. 22 బంతులు ఎదుర్కొని 17 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో రిషభ్ పంత్ అజేయ సెంచరీతో, హార్దిక్ పాండ్యా ఆల్‌రౌండ్ ప్రదర్శనతో చెలరేగడంతో భారత్ గెలిచి సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఇదిలా ఉంటే.. సోమవారం కోహ్లి ట్విటర్ వేదికగా హెల్త్ సప్లిమెంట్ వెల్‌మ్యాన్‌కు సంబంధించిన యాడ్ షేర్ చేశాడు.
#WeAreWellman and we don’t let the pressures of the game change us, we change the game instead.
Visit https://t.co/dgAZldfBkQ to claim your #Wellman at a special price from me!
Use Coupon Code “NONSTOP”#vitabiotics #wellmanvitamins #ad pic.twitter.com/daO5qddOut— Virat Kohli (@imVkohli) July 18, 2022
‘వెల్మ్యాన్.. ఆట మీది ఒత్తిడి తాలుకు ప్రభావం మన మీద పడనివ్వం.. అందుకు బదులుగా ఆటను మార్చుకుంటాం. నా కూపన్ కోడ్ నాన్‌స్టాప్‌తో కొనుగోలు చేస్తే స్పెషల్ ఆఫర్’’ అంటూ కోహ్లి ట్వీట్ చేశాడు. ఇక ఇందుకు స్పందించిన నెటిజన్లు అతడిపై సెటైర్ల వర్షం కురిపిస్తున్నారు. ‘‘ఆటపై దృష్టి పెట్టకుండా ఇలా సోషల్ మీడియాలో ప్రొడక్ట్స్ అమ్ముకుంటున్నావు. అయినా పరుగులే చేయలేని వాడికి విటమిన్స్ తీసుకుంటే ఏంటి? లేకపోతే ఏంటి? ఇక అడ్వర్టైజ్మెంట్లు చేసుకుంటూ బతికెయ్! నువ్వు ఇందుకు పనికివస్తావు! అయినా సెంచరీ చేయాలంటే ఏదైనా కూపన్ ఉందా? ముందు అది తీసుకో. నిన్ను అసలు టీమ్ నుంచి తప్పించాలి’’ అని కామెంట్లు చేస్తున్నారు.