విజయ్‌ సేతుపతి కూతురికి రేప్ బెదిరింపులు! - MicTv.in - Telugu News
mictv telugu

విజయ్‌ సేతుపతి కూతురికి రేప్ బెదిరింపులు!

October 20, 2020

vijay

ధోని క్రికెట్ సరిగ్గా ఆడకపొతే ఆయన కూతురు జీవాను అత్యాచారం చేస్తామని కొందరు సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన సంగతి తెల్సిందే. ఆ పోస్టులపై నెటిజన్లు ఆగ్రహాం వ్యక్తం చేశారు. తాజాగా తమిళ నటుడు విజయ్ సేతుపతి కూతురుకి కొందరు అత్యాచార బెదిరింపులకు పాల్పడుతున్నారు. ‘800’ పేరుతో రూపొందుతోన్న శ్రీలంక మాజీ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ లో నటించడానికి విజయ్ సేతుపతి ఒప్పుకున్నాడు. 

ఇందుకు సంబంధించిన పోస్టర్లు కూడా విడుదల అయ్యాయి. దీనిపై తమిళులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమిళుడైన విజయ్ సేతుపతి శ్రీలంక క్రికెటర్ బయోపిక్‌లో ఎలా నటిస్తాడని అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవాలంటూ విజయ్‌ సేతుపతికి మురళీధరన్ విజ్ఞప్తి చేశారు. విజయ్ సేతుపతి ఈ సినిమా నుంచి తప్పుకున్నాడు. అయినా కూడా కొందరు దుండగులు ఆయన చిన్న కూమార్తెపై సోషల్‌ మీడియాలో అత్యాచార బెదింపులకు పాల్పడుతున్నారు. ఆయన కూతురిపై  అఘాయిత్యానికి పాల్పడతామని, తాము అలా చేస్తేనే ఈలం తమిళుల బాధ ఎలా ఉంటుందో ఆ నటుడికి అర్థం అవుతుందని ఓ నెటిజన్ పోస్టు చేశాడు. దీనిపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సింగర్‌ చిన్మయి ఘాటుగా స్పందించారు. సదరు నిందితుడిని వెంటనే అరెస్ట్ చేయాలని చెన్నై పోలీసులను కోరారు.