Twitter war between Telangana Government, Harish Rao on medical college allocation
mictv telugu

గవర్నర్, కేంద్రంపై హరీష్ రావు ఫైర్..వరుస ట్వీట్లతో విమర్శల దాడి

March 5, 2023

చల్లారినట్టు కనిపించిన గవర్నర్ vs బీఆర్ఎస్ వివాదం మళ్లీ ముదురుతోంది. రాజ్‌భవన్ టార్గెట్‌గా బీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా మంత్రి హరీష్ రావు సీన్‎లోకి ఎంట్రీ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం సకాలంలో మెడికల్ కాలేజీల కోసం దరఖాస్తు చేసుకోలేదంటూ గవర్నర్ తమిళి సై పెట్టిన ట్వీట్‌పై హరీష్‎రావు మండిపడ్డారు. వరుస ట్వీట్లతో కేంద్రాన్ని టార్గెట్ చేశారు.

వైద్య కళాశాలల కేటాయింపు విషయంలో తెలంగాణపై కేంద్ర సర్కార్ వివక్ష చూపిందని హరీష్ ఆరోపించారు. దేశంలో 157 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన బీజేపీ ప్రభుత్వం.. తెలంగాణకు మాత్రం ఒక్క కాలేజ్ కూడా కేటాయించలేదని మండిపడ్డారు.అప్పటి మంత్రి ఈటల రాజేందర్ కోరిక మేరకు మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తామని కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ చెప్పిన వీడియోను హరీష్ రావు ట్విట్టర్‎లో పెట్టారు

 

ప్రతీ జిల్లాలకు ఓ మెడికల్ కాలేజీ ఉండాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ రాష్ట్ర నిధులతో 12 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశారన్నారు. కేంద్రం, గవర్నర్ అనవసర విమర్శలు మానుకోవాలని సూచించారు. వీలైతే ఒక రోజు 8 మెడికల్ కాలేజీలను ప్రారంభించిన తెలంగాణను అభినందించాలని హరీష్ ట్వీట్ చేశారు.