వీటిని చూసి బుద్ది తెచ్చుకోవాలే - MicTv.in - Telugu News
mictv telugu

వీటిని చూసి బుద్ది తెచ్చుకోవాలే

June 22, 2017

https://www.youtube.com/watch?v=mSP1U55ccgg

ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోక పోయినా  మనుష్యులు మాత్రం వీటి నుండి బుద్ది తెచ్చుకోవాల్సిందే… పిల్ల బాయిల వడ్డదంటే అంబలి తాగొస్తనే రకాలు మన  తాన శాననే ఉన్నవి.  పక్క మనిషి కష్టాల్ల ఉంటే… మనదేం పోయిందిలే అనే బాపతుగాళ్లు…. పక్కోళ్ల బలహీనతను,కష్టాన్ని క్యాష్ చేసుకునే కంత్రీగాళ్లకు కొదవ లేదు.  ఇసోంటోళ్లు సౌత్ కోరియాలోని  సియోల్ గ్రాండ్ పార్కు ఏనుగుల నుండి  బుద్ది తెచ్చుకుంటే మంచిది.  ఇంతకు విషయం ఏందంటే… పార్కులున్న నీళ్ల  హౌజ్ వద్దకు  నీళ్లు తాగేందుకు  ఏనుగు.. దాని పిల్ల వచ్చినవి. పొరపాట్న పిల్ల ఏనుగు గుంతల పడింది…. పక్కనే ఉన్న మరో ఏనుగు  విషయం గమనించి టక్కున దాని వద్దకు వచ్చింది. వెంటనే రెండు పెద్ద ఏనుగులు నీళ్లకు దిగి పిల్ల ఏనుగును బయటకు తీసుకొచ్చినవి.

ఈ విషయం అక్కడి సీసీ టీవిలో రికార్డు  అయింది.  మన తాన శానా మంది  దెబ్బలు తాకి కష్టాల్ల ఉంటే… ఇబ్బందులు పడుతుంటే సెల్  ఫోన్లల్ల ఫోటోలు తీస్తంటరు.. ఇంకా కొందరైతే తెల్వి నెత్తిల కెల్లి దిగి అరికాళ్లకు అంటుకున్నోళ్లైతే ఏకంగా సెల్ఫీలే దిగుతరు. ఇసోంటోళ్లకు ఈ ఏనుగుతోటి పాఠం చెప్పించాలే.