two beautiful ladies marriage
mictv telugu

రెండు దేశాల లెస్బియన్ మిస్‌లు పెళ్లాడేశారుగా..

November 3, 2022

ఔను వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు.ప్రేమించుకున్నారు.ఇప్పుడు పెళ్ళికూడా చేసేసుకున్నారు.దీంట్లో విచిత్రం ఏంటి అంతా కామనే కదా అనుకుంటే పొరపొటే. ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్..ప్రేమించి పెళ్లి చేసుకున్నది. ఓ అమ్మాయి, అబ్బాయి కాదు. పోని హిజ్రాలు కాదు. వారిద్దరు వాళ్ల దేశంలోనే అందగత్తెలు. మిస్ అర్జెంటీనా-2020 మరియానా వరేలా, మిస్ ప్యూరేటో రికో-2020 ఫాబియోల వాలంటైన్ వివాహం చేసుకున్నట్లు సోషల్ మీడియాగా వెల్లడించారు.

ఇద్దరు అమ్మాయిల మధ్య స్నేహం ఎలా ఉన్నా పెళ్లి మాత్రం అబ్బాయిలతోనే జరగాలి.ఇదే భారత దేశంలో ఉన్న ఆచారం. కానీ విదేశాల్లో మనం అబ్బాయి, అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు పెళ్లి చేసుకోవడం కామన్ గా చూస్తుంటాం. ఈ మధ్య ఇలాంటి ఘటనలో ఎన్నో చూశాం ఇప్పుడు అదే కోవాలోకి చేరిపోయారు మరియానా వరేలా, ఫాబియోలలు.

గత కొంతకాలంగా డేటింగ్ లో ఉన్న మరియానా వరేలా, ఫాబియోల వాలంటైన్ వివాహ బంధంలోకి అడుగు పెడుతున్నట్లు వాళ్లే స్వయంగా వెల్లడించారు. అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుని తమ ఆనందాన్ని వ్యక్తం చేసారు. వాళ్ళిద్దరికీ 2020 బ్యూటీ పోటీల్లో పరిచయం ఏర్పడింది. అప్పటినుంచి డేటింగ్ లో ఉండి ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు.ఇక వారి వివాహానికి వాళ్ల దేశాల్లో అనుమతి ఉంది. స్వలింగ సంపర్కులకు అర్జెంటీనా 2010లోనే అనుమతిచ్చింది. ఇక మిస్ ప్యూరేటో రికో 2015 లో చట్టబద్ధం చేసింది.