కరోనా మందు ఇస్తామని బాలికపై అత్యాచారం - MicTv.in - Telugu News
mictv telugu

కరోనా మందు ఇస్తామని బాలికపై అత్యాచారం

July 4, 2020

Two Boys On Girl In Chhattisgarh

కరోనా రాకుండా మందు ఇస్తామని చెప్పి ఓ బాలికపై ఇద్దరు మైనర్లు దారుణానికి ఒడిగట్టారు. కట్టెల కోసం అడవిలోకి వెళ్లిన ఆమెను నమ్మించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. చత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని ఓ గ్రామంలో జరిగింది. ఈ సంఘటన స్థానికంగా సంచలనం రేపింది.  తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మైనర్ వయసులోనే ఈ విధమైన మోసం, లైంగిక దాడికి పాల్పడిన విషయం తెలిసి స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

ఓ గ్రామానికి చెందిన మైనర్ బాలిక కట్టెల కోసం అడవికి వెళ్లింది. ఆ సమయంలో ఇద్దరు బాలురు అక్కడికి వచ్చి కరోనా తగ్గేందుకు తాము మందులు ఇప్పిస్తామని చెప్పారు. అది నమ్మి వారితో పాటు ఆస్పత్రికి వెళ్లి బయలుదేరింది. నిందితుల్లో ఒకరి ఇంటికి తీసుకువెళ్లి అత్యాచారం చేశారు. ఆ బాలిక ఇంటికి వచ్చిన తర్వాత అనుమానంతో తల్లిదండ్రులు ఆరా తీశారు. కరోనా మందు పేరుతో బయటకు తీసుకెళ్లి లైంగిక దాడి చేసినట్టుగా చెప్పింది. దీంతో  పోస్కో చట్టం ప్రకారం కేసు నమోదు ఒకరిని అదుపులోకి తీసుకున్నట్టు ఏఎస్పీ ప్రతిభా పాండే వెల్లడించారు.