గుజరాత్ : భక్తి గీతాలు పెట్టాడని కొట్టి చంపేశారు - MicTv.in - Telugu News
mictv telugu

గుజరాత్ : భక్తి గీతాలు పెట్టాడని కొట్టి చంపేశారు

May 6, 2022

ఇంటి ఆవరణలో స్పీకర్‌లో భక్తి గీతాలు ప్లే చేశాడని 42 ఏళ్ల వ్యక్తిని దారుణంగా కొట్టి చంపేశారు. మే 3వ తేదీన మెహ్‌సనా జిల్లాలో ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. జశ్వంత్ థాకూర్, అజిత్‌లు సోదరులు. తమ ఇంటి ఆవరణలో చిన్న గుడి నిర్మించుకొని మే 3న ఆలయంలో దీపాలు వెలిగించి భక్తి గీతాలు పెట్టారు. స్పీకర్లు వినియోగించడంపై పక్కన ఉన్న సదాజి థాకూర్‌తో పాటు మరో ఐదుగురు వ్యక్తులు అభ్యంతరం వ్యక్తం చేశారు. సౌండ్ తక్కుగానే ఉందని చెప్పినా వినకుండా ఆగ్రహంతో సోదరులిద్దరిపై కర్రలతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. సమాచారం అందుకున్న పోలీసులు గాయపడ్డ సోదరులిద్దరినీ ఆస్పత్రికి తరలించగా, అక్కడికి చేరుకునేలోపే జశ్వంత్ చనిపోయాడు. మరో సోదరుడు అజిత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మే 4న ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.