బావిలో దూకిన చెల్లి.. కాపాడబోయిన ఇద్దరు అన్నలు కూడా.. - MicTv.in - Telugu News
mictv telugu

బావిలో దూకిన చెల్లి.. కాపాడబోయిన ఇద్దరు అన్నలు కూడా..

May 8, 2019

వనపర్తి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఇంట్లో వాళ్ళతో గొడవపడిన ఓ బాలిక మనస్తాపంతో ఆత్మహత్య చేసుకోవడానికి  బావిలో దూకేసింది.ఆమెను రక్షించేందుకు వెంటనే ఆమె ఇద్దరు సోదరులు కూడా బావిలో దూకేశారు. కానీ ఆమెను వారిద్దరూ కాపాడటం కాదు కదా.. వారు కూడా ప్రాణాలు కోల్పోయారు. హృదయ విదారకమైన ఈ ఘటన అమరచింత మండలంలో జరిగింది.

నందిమల్ల గ్రామానికి చెందిన జ్యోతి (16), రమేష్ (19), సంజీవ్ (23) ముగ్గురూ తోబుట్టువులు. బుధవారం సాయంత్రం వీరి మధ్య సెల్ ఫోన్ విషయంలో గొడవ జరిగింది. దీంతో జ్యోతి పరిగెత్తుకుంటూ వెళ్లి ఇంటికి సమీపంలో ఉన్న బావిలో దూకేసింది. చెల్లి బావిలో విషయం తెలుసుకున్న ఇద్దరు అన్నలూ ఆమెను కాపాడేందుకు బావిలో దూకేశారు.  బావిలో నీటి కంటే ఎక్కువగా బురద ఉండటంతో వారు ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఒకే ఇంట్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోవడంతో ఆ కుటుంబం, ఆ గ్రామం కన్నీరుమున్నీరవుతోంది.

ఆదిలాబాద్‌లో ముగ్గరు..

ఆదిలాబాద్ జిల్ల నార్నూర్‌ మండలం కొత్తపల్లిలో కలుషిత ఆహారం ముగ్గురు ప్రాణాలు తీసింది.  కోలంగూడలో జరిగినపెళ్లి విందులో ఫుడ్‌ పాయిజన్‌ కావడంతో ముగ్గురు మృతిచెదగా, 25 మందికి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బాధితులను ఉట్నూరు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.