ఉగ్రవాదుల కాల్పుల్లో ఇద్దరు బీఎస్‌ఎఫ్‌ జవాన్లు మృతి - MicTv.in - Telugu News
mictv telugu

ఉగ్రవాదుల కాల్పుల్లో ఇద్దరు బీఎస్‌ఎఫ్‌ జవాన్లు మృతి

May 20, 2020

jawan

లాక్ డౌన్ లోనూ ముష్కరులు రెచ్చిపోతున్నారు. భద్రతా దళాలపై కాల్పులకు తెగబడుతున్నారు. ఈ రోజు ఇద్దరు బీఎస్ఎఫ్ జవాన్లను ఉగ్రవాదులు కాల్చిచంపారు.

జమ్మూకశ్మీర్‌లోని గండెర్బల్‌ జిల్లాలో ఈ ఎన్కౌంటర్ జరిగింది. 1ఇక్కడి పండాచ్‌ ప్రాంతంలో పికెట్‌ నిర్వహిండగా మోటార్‌ సైకిల్‌పై వచ్చిన ఉగ్రవాదులు వీరి పైకి కాల్పులు జరిపారు. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. గాయపడిన జవాన్లను సౌరా ప్రాంతంలోని స్కిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఒకరు మరణించగా.. మరొకరు తీవ్ర గాయాల కారణంగా ఆస్పత్రిలో ప్రాణాలు విడిచారు. ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాదులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టామని అధికారులు తెలిపారు.