వీడియో : రెండు బస్సులు ఢీ.. 30 మందికి గాయాలు - MicTv.in - Telugu News
mictv telugu

వీడియో : రెండు బస్సులు ఢీ.. 30 మందికి గాయాలు

May 18, 2022

తమిళనాడు సాలెం జిల్లాలో రెండు బస్సులు పరస్పరం ఢీకొన్నాయి. మంగళవారం సాయంత్రం జరిగిన ఈ ఘటనలో 30 మంది గాయపడ్డారు. బస్సులో ఉన్న సీసీ కెమెరాలో ఈ దృష్యాలు రికార్డయ్యాయి. తాజాగా ఆ వీడియో బయటపడింది. అందులో వేగంగా వెళ్తున్న బస్సును ఎదురుగా వచ్చిన బస్సు ఢీకొట్టింది. ఆ దెబ్బకు బస్సులో ఉన్న డ్రైవరు ఎగిరిపడ్డాడు. కెమెరాలు ఉన్న బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది.