దేశ రాజధానిలో కాల్పుల మోత..ఇద్దరు నేరస్తులు హతం - MicTv.in - Telugu News
mictv telugu

దేశ రాజధానిలో కాల్పుల మోత..ఇద్దరు నేరస్తులు హతం

February 17, 2020

cvn vbh

ఢిల్లీలో తెల్లవారుజామున తుపాకులకు పని చెప్పారు పోలీసులు. ఇద్దరు మోస్ట్‌వాంటెడ్ నేరస్తులను ఎన్‌కౌంటర్ చేశారు. సోమవారం ఉదయం 5 గంటల సమయంలో ప్రహ్లాద్‌పూర్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో రాజా ఖురేషి, రమేష్ బహదూర్‌ అనే నేరస్తులు మరణించినట్టు పోలీసులు వెల్లడించారు. పలు దోపిడి, హత్య కేసుల్లో వీరిద్దరూ మోస్ట్‌ వాంటెడ్ నేరస్తులని వారు తెలిపారు. ఘటన స్థలానికి ఉన్నతాధికారులు చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. 

నేరస్తులుగా ఉన్న రాజా ఖురేషి, రమేష్ బహదూర్‌ కారులో పోలీసుల కళ్లుకప్పి కారులో పారిపోతుండగా గుర్తించారు. వెంటనే వీరిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు వెంబడించారు. కానీ వారు కాల్పులు  జరపడంతో పోలీసులు ఎదురుకాల్పులు చేశారు. ఈ ఘటనలో ఇద్దరూ రోడ్డుపైనే తుపాకీ తూటాలకు హతమయ్యారు.సుమారు 30 రౌండ్ల కాల్పులు జరిగినట్టుగా అధికారులు చెబుతున్నారు. పోలీసులు ఎవరికీ ఈ ఘటనలో గాయాలు కాలేదు.మృతులపై ఉన్న నేరాల వివరాలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు.