కుల రాక్షసులు.. రోడ్డుపై మూత్రం పోశారని దళిత పిల్లలను కొట్టిచంపారు - MicTv.in - Telugu News
mictv telugu

కుల రాక్షసులు.. రోడ్డుపై మూత్రం పోశారని దళిత పిల్లలను కొట్టిచంపారు

September 25, 2019

అగ్రకుల అహంకారం కళ్లకు ఎక్కిన ఇద్దరు నీచులు దళిత బిడ్డల ప్రాణాలు బలిగొన్నారు. వారు చేసింది చాలా చిన్న తప్పు.. కానీ వాళ్లు దానిని భూతద్దంలో పెట్టి చూశారు. బహిరంగంగా వారు మలమూత్ర విసర్జన చేశారు. అదే వారు చేసిన మహాపాపంగా పరిగణించారు ఆ కులగజ్జి కుక్కలు. అంతమాత్రానికే వారి ప్రాణాలు తీసేంత హక్కు వారికి ఎవరిచ్చారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మధ్యప్రదేశ్‌లోని శివపురి జిల్లా బావ్‌ఖేడీ గ్రామంలో ఈ దారుణం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఇద్దరు దళిత పిల్లలు రోషణి(12), అవినాష్(10)లు ఆ గ్రామ పంచాయతీ భవనానికి సమీపంలో బహిరంగ మలమూత్ర విసర్జన చేశారు. అది గమనించిన యాదవ కమ్యూనిటీకి చెందిన హాకిం, రామేశ్వర్ పిల్లలపై దాడికి పాల్పడ్డారు. 

Mayawati Raps BJP.

విచక్షణారహితంగా చితకబాదారు. దీంతో పిల్లలకు తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే వారిని చికిత్స నిమిత్తం శివపురి జిల్లాలోని ఓ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితులు ఇలిద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో వారు మాట్లాడిన మాటలు బాధిత కుటుంబాన్ని ఆగ్రహానికి గురిచేస్తున్నాయి. ఆ రాక్షసులను చంపమని దేవుడు చెప్పినందుకే తాము పిల్లలను కొట్టి గాయపరిచానని ఓ నిందితుడు పోలీసులకు చెప్పాడు. అన్యంపుణ్యం ఎరుగని పసివాళ్ల ప్రాణాలు అనర్థంగా తీసిన వారిద్దరిని కఠినంగా శిక్షించాలని దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.