పెళ్లికి పోతున్నారా? అయితే ఈ వార్త తప్పక చదవండి.. - MicTv.in - Telugu News
mictv telugu

పెళ్లికి పోతున్నారా? అయితే ఈ వార్త తప్పక చదవండి..

May 22, 2020

Two days after marriage, young woman tests positive for COVID-19

ఒకవైపు కరోనా వైరస్ వ్యాప్తి జరుగుతోన్నా కూడా కొందరు పెళ్లి చేసుకోకుండా ఉండలేకపోతున్నారు. దీంతో చేసేదేమి లేక 50 మంది అతిథుల మధ్య వివాహాలు జరుపుకోవచ్చని కేంద్రం అనుమతిచ్చింది. అయినా కూడా పెళ్లిల ద్వారా కరోనా వ్యాప్తి జరుగుతునే ఉన్నది. ఇటీవల మధ్యప్రదేశ్ లో పెళ్ళైన రెండు రోజుల తరువాత వధువుకు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో వధూవరుల కుటుంసభ్యులు, బంధుమిత్రులు భయాందోళనకు గురవుతున్నారు.

భోపాల్‌లోని జట్ ఖేడి ప్రాంతానికి చెందిన యువతికి మంగళవారం నాడు పెళ్లి అయింది. ఆమెకు గత కొద్ది రోజులుగా జలుబు, జ్వరం ఉండటంతో మాత్రలు వేసుకోగా కాస్త ఉపశమనం లభించింది. ముందు జాగ్రత్తగా ఆమె కరోనా పరీక్షలు కూడా చేయించుకుంది. ఈ క్రమంలో గురువారం వచ్చిన పరీక్షా ఫలితాల్లో ఆమెకు కరోనా ఉన్నట్లుగా నిర్ధారణ అయింది. దీంతో విషయం తెలుసుకున్న అధికారులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. వధూవరుల కుటుంబసభ్యులతోపాటు పెళ్లికి హాజరైన 32 మంది బంధువులను క్వారంటైన్‌లోకి పంపారు.