తెలంగాణాలో నేడు, రేపు సెలవులు - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణాలో నేడు, రేపు సెలవులు

October 14, 2020

Two days holidays for telangana people

తెలంగాణ రాష్ట్రాన్ని వర్షాలు ముంచెత్తాయి. గత రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్నాయి. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ఇళ్లల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో రాష్ర్ట ప్రభుత్వం జీహెచ్ఎంసీ పరిధిలో ఇవాళ, రేపు సెలవులు ప్రకటించింది. ఈ సెలవులు ప్రభుత్వ, ప్రైవేట్ అన్ని సంస్థలకు వర్తిస్తాయి. అలాగే ప్రైవేట్ కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం కల్పించాలని ప్రభుత్వం సూచించింది. అనవసరంగా ప్రజలు బయటకు రాకూడదని సూచించింది. అత్యవసరం అయితేనే, అది కూడా కుటుంబంలో ఒకరు మాత్రమే బయటికి వచ్చి కావాల్సినవి తీసుకుని వెళ్లాలని సూచించింది. 

పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. పాత భవనాలను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని తెలిపింది. రాష్ర్ట వ్యాప్తంగా కలెక్టర్లను, పోలీసు శాఖను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలపై సీఎం కేసీఆర్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని అన్నివిధాలా సన్నద్ధంచేసి తక్షణం సహాయచర్యలు చేపట్టాల్సిందిగా ఆదేశించారు. ముంపు, లోతట్టు ప్రాంతాల్లో రక్షణ చర్యలు చేపట్టాల్సిందిగా డీజీపీ ఎం మహేందర్‌రెడ్డిని ఆదేశించారు.