తెలంగాణకు వర్ష సూచన - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణకు వర్ష సూచన

May 17, 2019

విపరీతమైన ఎండల కారణంగా ఉక్కిబిక్కిరి అవుతోన్న తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. మహారాష్ట్ర నుంచి కర్ణాటక, తమిళనాడుపైగా ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో ఈరోజు, రేపు ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.

Two Days rain prediction in telangana state

తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది. అలాగే, పగటి సమయంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయని తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా గురువారం భారీ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని.. సిరిసిల్ల జిల్లాల్లో అత్యధికంగా 45.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయిందని పేర్కొంది.