అలర్ట్ : హైదరాబాదులో రెండ్రోజులు వైన్స్ బంద్ - MicTv.in - Telugu News
mictv telugu

అలర్ట్ : హైదరాబాదులో రెండ్రోజులు వైన్స్ బంద్

April 9, 2022

02

శ్రీరామనవమి సందర్భంగా పండుగ సజావుగా జరిగేందుకు పోలీసులు తగిన చర్యలు తీసుకుంటున్నారు. హైదరాబాదుతో పాటు భైంసాలో నవమి వేడుకలకు హైకోర్టు అనుమతిచ్చిన నేపథ్యంలో మార్గదర్శకాలను రూపొందించారు. ఇందులో భాగంగా ముందు జాగ్రత్త చర్యగా హైదరాబాదు నగరంలో రెండు రోజులు మద్యం షాపులను బంద్ చేయాలని ఆదేశించారు. శనివారం సాయంత్రం 6 గంటల నుంచి సోమవారం ఉదయం ఆరు గంటల వరకు మద్యం షాపులు మూసి ఉంటాయని పోలీసులు తెలిపారు. నిబంధనలు ఎవరైనా ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శోభాయాత్రను ఆదివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుపుకోవాలని హైకోర్టు ఆదేశించింది.