వీడియో కాల్‌లో కుక్కుల చాటింగ్.. ఏందిర భయ్, బైటికి పోనిస్తలేర్.. - MicTv.in - Telugu News
mictv telugu

వీడియో కాల్‌లో కుక్కుల చాటింగ్.. ఏందిర భయ్, బైటికి పోనిస్తలేర్..

May 4, 2020

Two dog BFFs talk on video call during lockdown. Internet goes aww over trending clip

లాక్‌‌డౌన్‌తో ఇళ్లల్లో ఉన్నవారు ఫోన్‌లు చేత పట్టుకుని టైంపాస్ చేస్తున్నారు. ఇంక వర్క్ ఫ్రం హోంలో ఉద్యోగులు అలా పని చేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు. మరి పాపం పెంపుడు జంతువులు ఏం చేస్తాయి. పాపం వాటినీ ఇప్పుడు బయటకు తీసుకువెళ్లే వీలు లేకుండా పోయింది. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రాలు సరదాగా పార్కుల్లో జాగింగ్‌కు అలవాటు పడ్డ అవి లాక్‌డౌన్‌‌తో ఆ సరదాకి కూడా దూరమయ్యాయి. ఇంత పారేస్తే తిని ముదురుకుంటుంది అనుకుంటారు తప్పితే.. పాపం అది కూడా లాక్‌డౌన్ వల్ల ఇంట్లో ఎంత బోర్ ఫీలవుతోందోనని ఎవరు గ్రహిస్తారు చెప్పండి? లైకా అనే పెంపుడు కుక్క య‌జ‌మాని జెరెమీ హోవార్డ్‌ ఓ ఐడియా వేశాడు.

Barking From Home: Dog Best Friends 'Chat' On Video Call During Lockdown

Dogs before 2020: met in the park, played outside, etc.Dogs in 2020:? Jeremy Howard

Publiée par storyful sur Mardi 28 avril 2020

వీడియో కాల్‌తో లైకాను సర్‌ప్రైజ్ చేశాడు. వీడియోలో తన బెస్ట్ ఫ్రెండ్‌ను మామూలుగా మురిసిపోలేదు అది. స్నేహితుడు హెన్రీని చూసి ఈ పెంపుడు శునకం అరుస్తూ ముచ్చటించింది. అటువైపున్న హెన్రీ కూడా చాలా రోజులకు స్నేహితుడిని చూసి సంతోషంతో గ‌దిలో గెంతులు వేసింది. మనకు అర్థం కాని వాటి భాషలో అవి కొంత సమయం వరకు బౌబౌమని మాట్లాడుకున్నాయి. దీన్నంతా కెమెరాల్లో బంధించిన హోవార్డ్‌ ఈ వీడియోను సోష‌ల్ మీడియాలో పంచుకున్నాడు. ఈ వీడియోను చూసి నెటిజన్లు ఆశ్చర్యానికి గురవుతున్నారు. పాపం అవి కూడా తమ చిన్న చిన్న ఆనందాలను ఎంతగా మిస్ అవుతున్నాయోననని అంటున్నారు. ‘ఏందిర బయ్ బయిటికి పోనిస్తలేరు. ఇంట్ల ఉండి ఉండి బోర్ కొడుతోంది’ అనుకున్నట్టే ఉంది వాటి బౌబౌ సంభాషణ చూస్తుంటే అని మరికొందరు నవ్వుల ఎమోజీలను పంచుకుంటున్నారు.