బైక్ గొడవ, బాణాలతో దాడి.. చావు బతుకుల్లో.. - MicTv.in - Telugu News
mictv telugu

బైక్ గొడవ, బాణాలతో దాడి.. చావు బతుకుల్లో..

April 17, 2019

కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. ఇద్దరు చెంచుల మధ్య జరిగిన గొడవ ఘర్షణకు దారితీసింది. కొట్టాలచెరువుగూడేనికి చెందిన ఉత్తలూరి లింగన్నపై అదే గూడేనికి చెందిన అంకన్న బాణాలతో దాడి చేశాడు. ఈ ఘటన మంగళవారం రాత్రి చోటు చేసుకుంది.

Two Friends Fight For bike Repair.. Attack with Arrow.. Incident In kurnool District

అంకన్న అవసరం నిమిత్తం  లింగన్న బైక్ తీసుకున్నాడు. రిపేరుకు  రావడంతో దాన్ని బాగు చేయించి ఇవ్వాలని లింగన్న కోరాడు. దానికి సరేనని చెప్పిన అంకన్న ఎన్నిరోజులైనా బైక్ ఇవ్వకుండా అలాగే తిరుగుతున్నాడు. ఓపిక నశించిన లింగన్న..డబ్బులు ఇవ్వాలని  అంకన్నను నిలదీశాడు. దీంతో ఇద్దరి మధ్యా గొడవ జరిగింది. మద్యం మత్తులో ఉన్న అంకన్న కోపంతో ఇంట్లో ఉన్న బాణంతో లింగన్నపై దాడి చేశాడు. ఈ దాడిలో లింగన్నకు ఛాతి, వీపు భాగంలో రెండు బాణాలు గుచ్చుకున్నాయి.

గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే లింగన్నను ఆత్మకూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో కర్నూలు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. నిందితుడు అంకన్న పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.