జ్యోతి, ప్రియ ప్రేమించుకున్నారు.. పెద్దలు ఒప్పుకోలేదని..  - MicTv.in - Telugu News
mictv telugu

జ్యోతి, ప్రియ ప్రేమించుకున్నారు.. పెద్దలు ఒప్పుకోలేదని.. 

May 18, 2020

Two Girls in Tamil nadu

వినడానికి వింతగా ఉన్నా.. ఇది నిజమే. ఇద్దరు అమ్మాయిల ప్రేమ రెండు జీవితాలను అర్ధాంతరంగా ముగిసేలా చేసింది. వేర్వేరు వ్యక్తులను పెళ్లి చేసుకుంటే తామిద్దరం ఎక్కడ విడిపోవాల్సి వస్తుందోననే భయం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. తమిళనాడులోని ఎలచ్చిపాళయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఇద్దరమ్మాయిల  ప్రేమ స్థానికంగా సంచలనంగా మారింది. దీంతో కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. లింగ బేధాన్ని మరిచి వీరిద్దరూ ప్రేమలో పడటం కారణంగా రెండు కుటుంబాల్లో విషాదం నింపింది. 

జ్యోతి (23)  అనే మహిళ పాలిటెక్నిక్​ పూర్తి చేసి పవర్​లూమ్​ వర్క్​ షాప్​లో పనిచేస్తోంది. అప్పటికే ఆమెకు పెళ్లై మూడేళ్ల పాప కూడా ఉంది. తర్వాత భర్తతో విడిపోయింది. ఈ సమయంలో తాను పని చేస్తున్న కంపెనీలో కొట్టాయపాలానికి చెందిన ప్రియ (20)తో పరిచయం ఏర్పడింది. దీంతో వారిద్దరూ ఒకరిపై ఒకరు ఇష్టం పెంచుకొని లింగభేదం హద్దుల్ని చెరిపేశారు. వీరు సన్నిహితంగా ఉండగా కుటుంబ సభ్యులు కూడా హెచ్చరించారు. ఈ క్రమంలో ఈ నెల 27న ప్రియకు పెళ్లి చేయాలని నిశ్చయించారు.  దీంతో తాము ఎక్కడ దూరం అవుతామోనే భయంతో జ్యోతి ఇంట్లో ఇద్దరూ ఒకే చీరకి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ప్రియ చాలాసేపు అయినా ఇంటికి రాకపోవడంతో జ్యోతి ఇంటికి వెళ్లగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.