రెండు తలల అరుదైన పాము..పాలుపోసిన జనం  - MicTv.in - Telugu News
mictv telugu

రెండు తలల అరుదైన పాము..పాలుపోసిన జనం 

December 11, 2019

West Bengal01

రెండు తలల పాము అనే మాట వినడం  కానీ ఎక్కువగా ఇవి కనిపించవు. చాలా అరుదుగా వీటిని చూసిన వారు ఉంటారు. ఇలాంటి అరుదైన పాము ఒకటి  కోల్‌కతాలోని బెల్డా అటవీ ప్రాంతంలోని ఎకరుఖి గ్రామంలో కనిపించింది. దీన్ని చూసిన ప్రజలు అంతా ఆశ్చర్యపోయారు. ఒకే వైపు రెండుతలతో నెమ్మదిగా కదలడం కనిపించింది. దానికి స్థానికులు పాలు పోసి ఆకలి తీర్చే ప్రయత్నం చేశారు. 

ఎకరుఖి గ్రామస్థులు జగల్ అనే ప్రాంతం వైపు వెళుతున్నప్పుడు కొంత మంది దీన్ని గుర్తించారు. ఈ రెండు తలల పాము గురించి అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీన్ని చూసేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. కొంతమంది ఈ రెండు తలల పాముకి ఓ పళ్లెంలో పాలు పోశారు. అది కూడా పాలలో కాసేపు తన మూతిని ఆనించి బయటకు వెళ్లిపోయింది. అటవీ అధికారులు దాన్ని తమ సంరక్షణలోకి తీసుకున్నారు.