అరుదైన రెండు తలల తాబేలు.. ఫిదా అవుతున్న నెటిజన్లు - MicTv.in - Telugu News
mictv telugu

అరుదైన రెండు తలల తాబేలు.. ఫిదా అవుతున్న నెటిజన్లు

August 30, 2019

Headed ...

రెండు తలల పామును చాలా మంది చూశారు. కొన్నిసార్లు మనుషులు, పశువులు రెండు తలలతో పుట్టిన సంఘటనలు ఉన్నాయి. కానీ చాలా అరుదుగా కనిపించే రెండు తలల తాబేలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. దక్షిణ కరోలినాలోని హిల్టన్ హెడ్ దీవీలో దీన్ని కనుగొన్నారు. రెండు తలలతో అతి చిన్న పరిమాణంలో ఈ తాబేలు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. జన్యుపరమైన లోపం వల్లే ఇలా రెండు తలలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. 

అయితే ఈ తాబేలు ఎక్కువ కాలం జీవించడం కష్టమే అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. రెండు తలల కారణంగా రెండు విధాలుగా ఆలోచించడంతో నీటిలో ఈదడం కష్టమని చెబుతున్నారు. అలాంటి అరుదైన జీవులు బతకాలంటూ నెటిజన్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. దాన్ని కాపాడేందుకు చర్యలు చేపట్టాలంటూ కోరుతున్నారు. ఏది ఏమైన చిన్న పరిమాణంలో ఉన్న ఈ బుల్లి తాబేలు ఇప్పుడు అందరి మనుసు దోచుకుంది.