యస్.. సురేశ్‌కు రెండు గుండెలు.. - MicTv.in - Telugu News
mictv telugu

యస్.. సురేశ్‌కు రెండు గుండెలు..

December 2, 2017

మనం ఎవరితోనైనా గొడవ పడినప్పుడు.. ‘నన్ను అలా అనడానికి నీకెన్ని గుండెలురా?’ అని అంటుంటాం ఆగ్రహంతో. మనిషితోపాటు చాలా ప్రాణులకు ఒకటే గుండె ఉంటుందని, రెండు గుండెలు ఉంటే ఎక్కువ ధైర్యం ఉంటుందనే ఊహతో అలా అంటుంటాం. నిజానికి రెండు గుండెలు ఉండవు.. అయితే కేరళకు చెందిన సురేశ్‌కు మాత్రం రెండు గుండెలు ఉన్నాయి! చిత్రంగా ఉన్నా ఇది నిజం.ఇటీవల 50 ఏళ్ల సురేష్ గుండె వ్యాధితో కోయంబత్తూరు మెడికల్ సెంటర్‌లో చేరాడు. పరీక్షించిన వైద్యులు అతని గుండె కేవలం 10 శాతం మాత్రమే పని చేస్తోందని నిర్ధారించారు. అవయవదానం కింద.. వేరే మహిళ బంధువులు ఇచ్చిన ఆమె గుండెను సురేష్ గుండెకు లింక్ చేసి కొత్త గుండెను అమర్చారు. ఆపరేషన్ సక్సెస్ అయింది. సురేశ్ రెండు గుండెలు ఒకే హార్ట్ బీట్‌తో చక్కగా  పనిచేస్తున్నాయి. అతడు పూర్తిగా కోలుకున్నాడు. ‘మగవారిలోని ఎక్స్, వై క్రోమోజోములు, ఆడవారిలోని ఉండే ఎక్స్, ఎక్స్ క్రోమోజోములతో కలిసి అవయవంగా పనిచేయడం క్లిష్టమైన అంశమని, అయితే సురేష్ విషయంలో ఈ అద్భుతం జరిగిందని వైద్యులు చెప్పారు.