సౌదీ శిక్ష..  ఇద్దరు భారతీయుల తలలు నరికివేత.. - MicTv.in - Telugu News
mictv telugu

సౌదీ శిక్ష..  ఇద్దరు భారతీయుల తలలు నరికివేత..

April 17, 2019

సౌదీ అరేబియాలో శిక్షలు ఎంత కఠినంగా ఉంటాయో అందరికీ తెలిసిందే. తాజాగా ఇద్దరి భారతీయులకు సౌదీ కోర్టు శిక్ష విధించింది. ఇద్దరు నిందితుల తలలు నరికివేయాలని ఆదేశాలు జారీ చేసింది. నిందితుల మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించడం కుదరదని, అందుకు సౌదీ చట్టాలు ఒప్పుకోవని సౌదీ ప్రభుత్వం తేల్చి చెప్పేసింది. ఈ విషయాన్ని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది.

Two Indians were sentenced to death for killing Saudi Arabia / partner, both were cut off

2015 డిసెంబర్ 9వ తేదీని పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌కు చెందిన సత్వీందర్ కుమార్, లూధియానాకు చెందిన హర్‌జీత్ సింగ్‌లు మరో భారతీయుడైన ఆరిఫ్ ఇమాముద్దీన్‌ హత్య కేసులో నిందితులు. దీంతో సౌదీ కోర్టు వీరిద్దకి ఫిబ్రవరి 28న శిక్ష అమలు చేసింది. వీరి కేసు విచారణను ఎంబసీ అధికారులు పరిశీలించగా.. అందులోని ఓ అధికారి, కనీసం నిందితుల మృతదేహాలనైనా అప్పగించాలని కోరారు. కానీ మరణశిక్ష పడిన వారి మృతదేహాలను వారి బంధువులకు అప్పగించేందుకు తమ చట్టాలు ఒప్పుకోమని చెప్పినట్లు విదేశాంగ శాఖ పేర్కొంది. శిక్షలను అమలు చేస్తున్న సౌదీ కోర్టు సమయంలో.. ఇండియన్ ఎంబసీకి ఎలాంటి సమాచారం ఇవ్వలేదని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.