Tamilanadu : తప్పుడు వార్తలు ప్రచారం చేసినందుకు ఇద్దరు జర్నలిస్టులపై కేసు నమోదు.. - Telugu News - Mic tv
mictv telugu

Tamilanadu : తప్పుడు వార్తలు ప్రచారం చేసినందుకు ఇద్దరు జర్నలిస్టులపై కేసు నమోదు..

March 5, 2023

తమిళనాడులో వలస కూలీలపై దాడి ఆరోపణలపై స్టాలిన్ ప్రభుత్వం విచారణ చేపట్టింది. తమిళనాడు ప్రభుత్వం ఆదేశాల మేరకు పోలీసులు ముగ్గురిపై కేసు నమోదు చేశారు. ఇందులో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఒక బిజెపి నాయకుడు, ఓ ప్రముఖ వార్తా సంస్థ ఎడిటర్ తో సహా ఇద్దరు జర్నలిస్టులపై తమిళనాడు పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు, వలసదారులపై దాడుల ఆరోపణలపై దర్యాప్తు చేయడానికి బీహార్ ప్రభుత్వం శనివారం (మార్చి 4) సమీక్ష కోసం సీనియర్ అధికారుల బృందాన్ని తమిళనాడుకు పంపింది.

కేసు నమోదు చేసిన వారిలో గోవా ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో స్టాండింగ్ కౌన్సెల్‌గా వ్యవహరిస్తున్న బీజేపీ అధికార ప్రతినిధి ప్రశాంత్ ఉమ్రావ్ కూడా ఉన్నారు. అతడిని పట్టుకునేందుకు మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. తమిళనాడులోని ఉత్తర భారత కార్మికులంతా రాష్ట్రంలో ప్రశాంతంగా జీవిస్తున్నారని తమిళనాడు ప్రభుత్వం శనివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. అనవసర పుకార్లతో ప్రజలకు భయబ్రాంతులకు గురిచేశారని మండిపడింది. తప్పుడు వార్తలను ప్రచారంచేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటానమి స్టాలిన్ సర్కార్ పేర్కొంది.

డీఎంకే ర్యాలీకి పలువురు ఉత్తరాది ప్రముఖ నేతలు హాజరయ్యారని అధికారి చెప్పడంతో పుకార్లు మొదలయ్యాయని పోలీసు అధికారి తెలిపారు. దీనికి సంబంధించిన వార్త మొదట దైనిక్ భాస్కర్ వెబ్‌సైట్‌లో ప్రత్యక్షమైనట్లు తెలుస్తోంది. ఇది వారి ప్రింట్ ఎడిషన్‌లో ప్రచురించబడలేదు, కానీ మా ప్రాథమిక పరిశోధన ఇదే ట్రిగ్గర్ అని సూచిస్తుంది. వెంటనే, ఉత్తర భారతీయ కార్మికులపై తమిళుల దాడులపై తన్వీర్ తప్పుడు కథనాలను ట్వీట్ చేశాడు. హిందీ మాట్లాడినందుకు తమిళనాడులో 12 మంది హత్యకు గురయ్యారనే తప్పుడు వార్తలు కూడా ఇందులో ఉన్నాయి.

ఈ అంశంపై మౌనంగా తమిళనాడు బీజేపీ నేతలు :

వలస కార్మికుల కుటుంబ వాట్సాప్ గ్రూపుల ద్వారా వార్త వ్యాప్తి చెందడంతో భయాందోళనలు వ్యాపించాయి. ఉత్తరాది రాష్ట్రాల్లోని అనేక ఆన్‌లైన్ , టీవీ వార్తా సంస్థలు ఈ కథనాన్ని ప్రసారం చేయడం ప్రారంభించాయి. బీహార్ బీజేపీ యూనిట్ కూడా తేజస్వి స్టాలిన్ పుట్టినరోజుకు హాజరైన విషయంపై నితీష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేసింది. అధికారి ప్రకారం, “లక్ష మంది అనుచరులతో ఉన్న ఒక డజను మంది ప్రముఖ, ధృవీకరించబడిన బిజెపి హ్యాండిల్స్ డిఎంకె ర్యాలీ జరిగినప్పటి నుండి దాని గురించి తప్పుడు వార్తలను వ్యాప్తి చేస్తున్నాయి.” తమిళనాడులోని బీజేపీ నేతలు మాత్రం ఈ విషయంలో మౌనంగా ఉన్నారు.

‘ఈ వ్యవహారంపై న్యాయమైన విచారణ జరగాలి’:

తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ పుట్టినరోజు వేడుకల కోసం తేజస్వి చార్టర్డ్ ఫ్లైట్‌లో చెన్నై వెళ్లినట్లు బీజేపీ అధికార ప్రతినిధి నిఖిల్ ఆనంద్ తెలిపారు. దానితో మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. అయితే కేక్ కట్ చేసిన తర్వాత తమిళనాడుకు అనుకూలంగా, బీహార్, బీహారీలకు వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడారని ప్రశ్నించారు. బీజేపీతో సహా పలువురు నేతలు సోషల్ మీడియా పోస్ట్‌లపై తమిళనాడు పోలీసుల ఆరోపణలపై, మేము న్యాయమైన విచారణ మాత్రమే కోరుకుంటున్నామని ఆనంద్ అన్నారు.