రేపిస్టుల సమాచారం ఇస్తే రూ.2లక్షలు - MicTv.in - Telugu News
mictv telugu

రేపిస్టుల సమాచారం ఇస్తే రూ.2లక్షలు

May 17, 2017

నిర్భయ ఘటన తరహాలోనే హర్యానాలోని గురుగావ్‌లో గత శుక్రవారం 22 ఏళ్ల యువతిపై గ్యాంగ్ రేప్ ఘటన సంచలనం సృష్టించింది. పరారీలో ఉన్న రేపిస్టుల కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.

ఇదే సమయంలో వీరి ఆచూకీ గురించి సమాచారమిస్తే రూ.2 లక్షలు బహుమానంగా ఇస్తామని గురుగావ్ పోలీసులు ప్రకటించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు గురుగావ్ సెక్షన్-18 పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. ఆ తర్వాత ఈ కేసు దర్యాప్తును సిట్‌కు అప్పగించారు.

నిందితులను సాధ్యమైనంత త్వరలో పట్టుకునేందుకు అన్నిరకాలుగా ప్రయత్నిస్తున్నట్టు గురుగావ్ కమిషనర్ సందీప్ ఖిర్వార్ తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు ప్రకారం, ఆమె ఆఫీసు నుంచి తిరిగివస్తుండగా ముగ్గురు వ్యక్తులు బలవంతంగా కారులోకి నెట్టి కదులుతున్న కారులోనే అత్యాచారం చేసి రోడ్డుపై పడేశారు.

HACK:

  • Two Lakhs reward for Gurgaon Rapists Information.