చెల్లెలిపై నాలుగేళ్లుగా అన్నల రేప్.. పోలీసులకు వీడియో.. - MicTv.in - Telugu News
mictv telugu

చెల్లెలిపై నాలుగేళ్లుగా అన్నల రేప్.. పోలీసులకు వీడియో..

October 18, 2018

కనురెప్పలే కాటేస్తున్నాయి. రాఖీ పండుగను ఘనంగా జరుపుకుంటున్న భారతావనిలో ఒళ్లు జలదరించే ఘోరాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. సొంత చెల్లిలిపై ఇద్దరు అన్నలు నాలుగేళ్లుగా సాగించిన అత్యాచారకాండ వెలుగుచూసింది. మానవ సంబంధాలకే మచ్చతెచ్చిన ఈ ఘోరం నేరాల అడ్డా ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో జరిగింది.

6767

నర్సింగ్ కోర్సు చదువుతున్న 16 ఏళ్ల బాధితురాలపై ఆమె పెద్దన్న(23), చిన్నన్న (21) ఈ దారుణానికి తెగబడ్డారు. వారి తండ్రి కొన్నాళ్ల కిందట చనిపోయాడు. విషయం బయటపెడితే నీతోపాటు అమ్మను కూడా చంపేస్తామని బెదిరించారు.దీంతో బాధితురాలు బయటికి చెప్పుకోలేకపోయింది. ఇక భరించలేక తల్లి సూచనపై వీడియో తీసి బుధవారం ఎస్పీ కార్యాలయానికి వెళ్లి అందించింది. తనను ఆ రాక్షసులనుంచి కాపాడాలని భోరున విలపిస్తూ ఎస్పీని కోరింది. పోలీసులు వెంటనే ఆ దుర్మార్గులను అరెస్ట్ చేశారు.