Two men bore a hole on liquor store wall to steal, caught drinking inside by police
mictv telugu

లిక్కర్ షాప్‌కు కన్నం వేసిన దొంగలు.. వచ్చిన పని మానేసి ఎంజాయ్ చేస్తూ..

September 6, 2022

దొంగతనం చేసేందుకు ఓ లిక్కర్ షాప్‌ను ఎంచుకున్నారు ఇద్దరు దొంగలు. పక్కా ప్లాన్ వేసి ఆ షాపులో దూరి సరుకంతా కాజేయాలనుకున్నారు. అనుకున్నట్లే దుకాణానికి చిన్నరంధ్రం చేసి, లోప‌లికెళ్లారు. ఇక దొంగతనం చేద్దామని మద్యం సీసాలను చేతిలోకి తీసుకున్న వారు మ‌న‌సు మార్చుకున్నారు. ఆ బాటిళ్లలోని మద్యాన్ని ఫుల్లుగా తాగుతూ ఎంజాయ్ చేశారు. అంత‌లోనే పెట్రోలింగ్‌కు వ‌చ్చిన పోలీసుల‌కు చిక్కారు. తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఆ దొంగ‌ల‌ను పోలీసులు ప‌ట్టుకున్న వీడియో నెట్టింట వైర‌ల్‌గా మారింది.

‘నవిన్‌స్ట‌న్ లోబో’ అనే జ‌ర్న‌లిస్ట్ ఈ వీడియోను ట్విటర్ లో షేర్ చేశారు. వీడియోలో దొంగ‌ల‌ను వైన్స్‌షాప్ రంధ్రంనుచి పోలీసులు లాగుతున్నారు. అతిచిన్న‌రంధ్రం నుంచి అతిక‌ష్టం మీద దొంగలు బ‌య‌ట‌కువ‌చ్చారు. బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర్వాత ఎలా రంధ్రం త‌వ్వార‌ని వారిని పోలీసులు ప్ర‌శ్నించారు. కాగా, ఈ వీడియోకు నెటిజ‌న్లు ఫ‌న్నీ కామెంట్లు పెడుతున్నారు.