ఆ ఎమ్మెల్యేలు ఇష్టపడ్డారు.. 21న పెళ్లి.. - MicTv.in - Telugu News
mictv telugu

ఆ ఎమ్మెల్యేలు ఇష్టపడ్డారు.. 21న పెళ్లి..

November 17, 2019

marry .

వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు. రాజకీయాలు కూడా వారిని ఒకింటి వారిని చేయడానికి మార్గం సుగమం చేశాయి. ఇద్దరూ ఒకే పార్టీలో, ఒకే పదవిలో ఉన్నారు. ప్రాంతాలు వేరైనా రాజకీయాలు ఒకటే కావడంతో పెళ్లి పీటలు ఎక్కేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అదితి సింగ్‌.. పంజాబ్‌లోని షహీద్‌ భగత్‌సింగ్‌ నగర్‌ ఎమ్మెల్యే అంగద్‌ సింగ్‌ షైనీలు ఈ నెల 21న పెళ్లి చేసుకోబోతున్నారు. ఇప్పటికే ఆహ్వానాలు అందించారు. 

వీరిద్దరూ ఒకే ఏడాది ఎమ్మెల్యే కావడం మరో విశేషం. తమ తమ అసెంబ్లీల్లోని ఎమ్మెల్యేల్లో వీరే అతి పిన్నవయస్కులు కూడా. అంగద్ కంటే అదితి నాలుగేళ్లు పెద్ద కావడం మరో విశేషం. అదితి తండ్రి అఖిలేష్‌ కుమార్‌ సింగ్‌ ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.  అంగద్‌ తండ్రి దిల్‌బాగ్‌ సింగ్‌ కూడా ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నవాన్‌షహర్‌ అసెంబ్లీ స్థానానికి ఆయన ప్రాతినిధ్యం వహించారు.