రెండు నెలల పిల్లోడు ఏం చేస్తాడు? కడుపునిండా తల్లిపాలో, బుడ్డిపాలో తాగి హాయిగా నిద్రపోతాడు. ఎవరైనా ఎత్తుకుంటే మెడలు కూడా సరిగ్గా నిలపలేక ఇబ్బందిపడిపోతాడు. చూపు కూడా సరిగ్గా నిలవదు, నవ్వు కూడా సందేహమే. కానీ ఓ రెండు నెలల బాబు మాత్రం ఏకంగా పాట పాడేశాడు. నమ్మశక్యం కాని ఆ బుడ్డోడి టాలెంట్ వీడియో ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది. వీడియో బాబును అతని తాత ఒడిలో కూర్చోబెట్టుకుని పాట పాడుతున్నాడు.
2-month-old sings a duet with grandpa. 🎶👶🏽❤️👴🏽🎵
(🎥:tinaburtonmiddlet)— GoodNewsCorrespondent (@GoodNewsCorres1) November 28, 2022
వాడు చక్కగా తాతపై చూపు నిలిపి వంత పాడుతున్నాడు. తాతను అనుకరిస్తూ.. ‘ఆఆ.. ఊఊ’ అని వాడికొచ్చిన శ్రుతిలయల్లో తెగ రాగం తీస్తున్నాడు. తాతవైపు నిలకడగా చూస్తూ, తన స్టైల్లో తన పాటను అదరగొట్టేశాడు. ‘ఏం టాలెంట్ గురూ, తాతా మనవళ్ల సింగ్ సాంగ్ సూపరెహే’ అని నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కొందరు పిల్లల్లో జన్యుపరంగానే ఇలాంటి అనుకరణ ప్రతిభ ఉంటుందని మరికొందరు విశ్లేషిస్తున్నారు.