పోలీసును కారుతో 2 కి.మీ. లాక్కెళ్లాడు.. ఢిల్లీలో దారుణం.. - MicTv.in - Telugu News
mictv telugu

పోలీసును కారుతో 2 కి.మీ. లాక్కెళ్లాడు.. ఢిల్లీలో దారుణం..

February 3, 2020

Delhi

ఢిల్లీలో సినీ ఫక్కీలో ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ కారు డ్రైవర్‌ను వెంబడించిన సంఘటన స్థానికంగా సంచలమైనది. నవంబర్‌లో జరిగిన ఈ సంఘటనకు సంబందించిన వీడియో ఆలస్యంగా వెలుగు చూసింది. ఢిల్లీకి చెందిన సునీల్ అనే ట్రాఫిక్ కానిస్టేబుల్ నాన్‌గోలి చౌక్ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్నాడు. 

అప్పుడు అక్కడికి ఓ కారు వచ్చింది. కారు ఆపి డ్రైవింగ్ లైసెన్స్, కారు కాగితాలు చుపించాల్సిందిగా సునీల్ కోరాడు. దీంతో ఆగ్రహించిన ఆ వాహనదారుడు అక్కడినుంచి వెళ్లిపోవడానికి ప్రయత్నించాడు. దీంతో సునీల్ కారు ముందుకు వెళ్లి ఆపడానికి ప్రయత్నించాడు. అయినా కూడా కారు డ్రైవర్ ఆపకుండా పారిపోవడానికి ప్రయత్నించాడు. దీంతో సునీల్ కారు బానెట్‌పై దూకాడు. అయినా కూడా కారు డ్రైవర్ ఆపకుండా రెండు కిలోమీటర్లు అలాగే తీసుకొని వెళ్ళాడు. కారులో ఉన్న ఓ వ్యక్తి ఈ సంఘటనను కెమెరాలో బంధించాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనలో కానిస్టేబుల్ సునీల్ గాయపడ్డాడు. దీంతో పోలీస్ అధికారులు కారు డ్రైవర్‌పై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.