నాగర్ కర్నూల్ లో విషాదం..కరోనాతో రెండు నెలల చిన్నారి మృతి! - MicTv.in - Telugu News
mictv telugu

నాగర్ కర్నూల్ లో విషాదం..కరోనాతో రెండు నెలల చిన్నారి మృతి!

May 31, 2020

kygy

కరోనాతో మరో పసిప్రాణం బలైంది. నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునుంతలలోని బీసీ కాలనీలో రెండు నెలల చిన్నారి కరోనాతో మృతి చెందింది. గత నెల 3న నాగర్‌కర్నూల్‌ ప్రభుత్వాస్పత్రిలో మగశిశువు జన్మించాడు. పది రోజులు హాస్పిటల్ లో ఉన్న తల్లిశిశువులు ఉప్పునుంతలకు వెళ్లారు. కాగా, ఆ బాబు ఈ నెల 27నుండి అనారోగ్యంగా ఉండడంతో తల్లి తండ్రులు ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చూపించారు. అక్కడి డాక్టర్లు శిశువును హైద్రాబాద్ లోని నిలోఫర్ ఆస్పత్రికి రిఫర్ చేసారు. అయితే, నిలోఫర్ హాస్పిటల్ కి తరలించే లోపే శిశువు మరణించాడు. దీంతో ఆ బాబు రక్త నమూనాలు సేకరించి పరీక్షలు చేయగా కరోనా పాజిటివ్ అని తేలింది. దాంతో అతడి తల్లి తండ్రులకు కూడా పరీక్షలు చేసారు. శిశువు కరోనా సోకి మరణించడంతో ఉప్పునుంతల గ్రామస్థులు బయాందోళనకు గురవుతున్నారు.

ఇదిలా ఉంటే తెలంగాణలో నిన్న కొత్తగా 74 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 41 కేసులు నమోదు కాగా, రంగారెడ్డి జిల్లాలో 5 కేసులు నమోదయ్యాయి. మహబూబ్ నగర్ 2, జగిత్యాల 2, సూర్యాపేట 1, వనపర్తి 1, వరంగల్ అర్బన్ 1, వికారాబాద్ 1, మేడ్చల్ 1, నాగర్ కర్నూల్ 1, నిజామాబాద్ 1, సంగారెడ్డి 3, వలస కార్మికుల్లో 9, విదేశాల నుంచి వచ్చినవారిలో 5 మందికి కరోనా సోకిందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. కరోనాతో నిన్న ఆరుగురు మృతిచెందగా మృతుల సంఖ్య 77కి చేరింది. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,499కి చేరిందని తెలిపారు. ఇప్పటివరకు డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 1412కు చేరింది. 1010 యాక్టివ్ కేేసులు ఉన్నాయి.