బిడ్డ కోసం ఇద్దరు తల్లుల ఆరాటం - MicTv.in - Telugu News
mictv telugu

బిడ్డ కోసం ఇద్దరు తల్లుల ఆరాటం

October 24, 2017

ఒకపక్క  ప్రాణాలను పణంగా పెట్టి జన్మనిచ్చిన తల్లి.. మరో పక్క ప్రాణం పెంచుకున్న పెంపుడు తల్లి.. ఇద్దరూ ఆ చిన్నారి తమకే దక్కాలని ఆరటపడుతున్నారు. డబ్బు ఆశతో ఆ పిల్ల తండ్రి చేసిన ఘోరం ఈ రోజు ముగ్గురి మనసుల్లో తీరని వ్యథ సృష్టించింది.

మహబూబాబాద్‌ జిల్లా గార్ల మండలం చిన్నకిష్ణాపురం గ్రామానికి మాలోత్ భావ్ సింగ్, ఉమ దంపతులు . వీరికి 2015లో ఆడపిల్ల పుట్టింది. అయితే ఆ పిల్ల పురిట్లోనే చనిపోయందని భావ్ సింగ్ భార్యను నమ్మించాడు.  ఆర్ఎంపీ డాక్టరు సాయంతో చిన్నారిని ఇల్లెందుకు చెందిన వేముల రాజేంద్రప్రసాద్‌, స్వరూప దంపతులకు రూ. 25 వేలకు అమ్మేశాడు. దత్తత కింద ఈ వ్యవహారం ముగిసింది. ఉమ తన కూతురు చనిపోయింది నమ్మేసింది. అయితే ఇటీవల మాటల మధ్యలో విషయం బయటపడ్డంతో ఆమె..  స్వరూప వద్దకు వెళ్లింది. తన బిడ్డను తనకివ్వాలని కోరింది. అయితే ఆ పిల్లను ఇవ్వనని స్వరూప మొండికేసింది. బాలిక కూడా పెంపుడు తల్లిని వదిలి వెళ్లనంటోంది. కన్నతల్లి గుంజుతున్నా.. పెంపుడు తల్లినే అదిమిపట్టుకోవడం.. చూపరులను ఉద్వేగానికి గురి చేసింది. విషయం అధికారులకు తెలిసింది. ఐసీడీఎస్‌ అధికారులు బాలలిక తన్వితను తమ సంరక్షణలోకి తీసుకున్నారు. అధికారులు తన్వితను కన్న తల్లిదండ్రులకు, పెంచుకున్న తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇస్తున్నారు.