హిందూ మహిళకు ముస్లింల అంత్యక్రియలు - MicTv.in - Telugu News
mictv telugu

హిందూ మహిళకు ముస్లింల అంత్యక్రియలు

December 4, 2019

మత సామరస్యం మరోసారి వెల్లివిరిసింది. ఒంటరి హిందూ మహిళకు ఇద్దరు ముస్లింలు అంత్యక్రియలు జరిపి.. భిన్నత్వంలో ఏకత్వానికి భారత్ ప్రతీక అనితెలియజేశారు. ఈ అరుదైన సంఘటన బీహార్ రాష్ట్రంలోని మనెర్‌లో జరిగింది. చందూ ఖాన్ తన మేనల్లుడు జావేద్ ఖాన్‌తో కలిసి దౌలాతియా దేవి అనే హిందూ మహిళ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. హిందూ సంప్రదాయం ప్రకారం ఆమె చితికి నిప్పు పెట్టి కర్మకాండలు చేశారు.

Muslim

భర్త చనిపోయి ఒంటరిగా ఉంటున్న 70 సంవత్సరాల దౌలతియా దేవి మనెర్‌లోని మీరా చౌక్‌లో ఇటీవల మరణించింది. ఆమె భర్త చాలా ఏళ్ల క్రితమే చనిపోయారు. ఆమెకు పిల్లలు కూడా లేరు. దీంతో ఆమె ఒంటరిగానే జీవించి డిసెంబర్ 2 మరణించింది. ఈ సందర్భంగా చందూఖాన్ మాట్లాడుతూ..దౌలతియా దేవికి అంత్యక్రియలు చేశామని హిందూ ధర్మం ప్రకారం 10 రోజుల తరువాత చేయాల్సిన అన్ని కర్మకాండలను కూడా చేస్తామని తెలిపారు. భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం ఉంది అనటానికి ఈ సంఘటన నిదర్శనమని పలువురు ప్రశంసిస్తున్నారు.