Two Muslims saved 35 lives in Gujarat cable bridge accident
mictv telugu

వంతెన విషాదం.. 35 మందిని కాపాడిన తౌఫీక్, హుసేన్

November 1, 2022

Two Muslims saved 35 lives in Gujarat cable bridge accident

పెను విషాదాన్ని మిగిల్చిన గుజరాత్‌లోని మోర్బీ నగరంలో జరిగిన తీగల వంతెన కూలిన ఘటనలో దాదాపు 141 మంది మరణించిన విషయం తెలిసిందే. దాదాపు 500 మంది ప్రమాద సమయంలో వంతెన మీద ఉండగా, జల సమాధి అయిన వారి మృతదేహాలు ఇంకా దొరకలేదు. ఆ సంఖ్య సుమారు వందకు పైనే ఉంటుందని అంచనా. బురద, మురికి నీరుతో కూడిన మచ్చు నదిలో చిక్కుకున్న మృతదేహాలను వెలికితీయడం కూడా ఓ రకంగా రిస్కుతో కూడుకున్న పని.

బ్రిటీష్ కాలం నాటి ఈ బ్రిడ్జికి ఏడు నెలల పాటు మరమ్మత్తులు జరిగినా, గడువు ముందే నిర్వాహకులు ప్రారంభించేశారు. ప్రమాదానికి కారణం నిర్వహణా లోపాలతో పాటు మానవ తప్పిదం కూడా ఉందని ప్రాథమికంగా తేలింది. ఇదిలా ఉంటే ప్రమాదం జరిగిన సమయంలో స్థానికంగా ఉన్న ఇద్దరు ముస్లిం వ్యక్తులు వెంటనే స్పందించి 35 మంది చిన్నారుల ప్రాణాలు నిలబెట్టిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తౌఫీక్ భాయ్, హుస్సేన్ పఠాన్లు అనే ఇద్దరు వ్యక్తులు సకాలంలో 35 మంది చిన్నారులను ఆస్పత్రికి తరలించి ఆపద్భాందవులయ్యారు. ఈ దుర్ఘటనలో మరింత మంది ప్రాణాలు కోల్పోకుండా ఆపగలిగారు. అలాగే సుమారు 50 మందిని కాపాడడంలో తమ సహాయ సహకారాలు అందించి శభాష్ అనిపించుకున్నారు. కాగా, స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రమాద బాధితులను మంగళవారం ప్రధాని మోదీ పరామర్శించనున్నారు.