ఏపీలో రెండు కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటయ్యాయి. గురువారం సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ మేరకు ఆమోద ముద్ర పడింది. కోనసీమలోని కొత్తపేట, జగన్ నియోజకవర్గం పులివెందులలు కొత్త డివిజన్లుగా ఏర్పడ్డాయి. దీంతో రెవెన్యూ డివిజన్ల సంఖ్య 74కు చేరింది. అంతేకాక, వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం, పంచాయితీ రాజ్ చట్టసవరణలకు కేబినెట్ ఆమోదం తెలపింది. అనంతరం మంత్రులు సీఎం ఆదేశాల మేరకు తమ పదవులకు రాజీనామా చేశారు. 24 మంది మంత్రులు తమ రాజీనామా పత్రాలను ముఖ్యమంత్రి చేతిలో అప్పగించారు. దీంతో కేబినెట్ సమావేశం ముగిసింది.