Home > Featured > హమ్మయ్య..ఇక బైక్‌పై ఇద్దరు వెళ్లొచ్చు..

హమ్మయ్య..ఇక బైక్‌పై ఇద్దరు వెళ్లొచ్చు..

bike

తెలంగాణలో రాష్ట్రంలో లాక్‌డౌన్ అమల్లో ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ప్రయాణాలపై పలు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. అయితే, సోమవారం రోజున ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ ప్రయాణాలపై పలు ఆంక్షలను సడలిస్తున్నట్లు ప్రకటించారు.

ఇప్పటి వరకు ద్విచక్ర వాహనంపై ఒక్కరు మాత్రమే వెళ్లడానికే అనుమతి ఉండగా, తాజాగా ప్రభుత్వం ఆ నిబంధనను తొలగించింది. బైక్ రైడర్‌తో పాటు.. వెనకాల ఒకరు కూర్చొని వెళ్లడానికి అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. కారులో డ్రైవర్ కాకుండా ముగ్గురు, ఆటోలో డ్రైవర్ కాకుండా ఇద్దరు వెళ్లడానికి అనుమతి ఇచ్చింది. అలాగే ఈరోజు తెలంగాణ ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి. ఉదయం 6గంట‌ల‌ నుంచి బస్సులు డిపో నుంచి బయలుదేరాయి. రాత్రి 7 లోగా బస్సులన్నీ డిపోలకు చేరుకుంటాయి. బస్సుల్లో ప్రయాణించేవారు తప్పనిసరిగా మాస్క్ ధరించాల్సి ఉంటుంది. మాస్క్ ధరించని వాళ్ళను బస్సులోకి అనుమతించారు. ప్రయాణికులు వెంట శానిటైజర్ తప్పక తెచ్చుకోవాలి. శానిటైజేర్, మాస్క్ తెచ్చుకొని వాళ్లకు బస్టాండ్ లో అందుబాటులో ఉండనున్నాయి.

Updated : 19 May 2020 4:27 AM GMT
Tags:    
Next Story
Share it
Top