'ఆర్ఆర్ఆర్' సినిమాకు ఇద్దరు దర్శకులా? - MicTv.in - Telugu News
mictv telugu

‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు ఇద్దరు దర్శకులా?

February 23, 2020

cccjtm

రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర వార్త ఫిల్మ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. రామ్ చరణ్.. అల్లూరి సీతారామరాజు పాత్రలో, జూ.ఎన్టీఆర్.. కొమరం భీమ్ పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని రాజమౌళితో పాటు మరో వ్య్తకి దర్శకత్వం వహిస్తున్నట్టు తెలుస్తోంది.

ఆర్ఆర్ఆర్ అని గూగుల్‌లో సర్చ్ చేసినప్పుడు దర్శకుల దగ్గర రాజమౌళితో పాటు సంజయ్ పాటిల్ అనే వ్యక్తి పేరు కూడా వస్తోంది. సంజయ్ పాటిల్‌ అనే దర్శకుడు సినీ ఇండస్ట్రీలో లేకపోవడం గమనార్హం. అలాగే నిర్మాత స్థానంలో దానయ్య పేరుతో పాటు రంజీత్ సత్రే, ప్రసన్న డియోచకే పేర్లు కూడా కనిపిస్తుండటం విశేషం. దీంతో ఆర్ఆర్ఆర్ ఫ్యాన్స్‌ షాక్‌కు గురౌతున్నారు. అయితే గూగుల్‌లో ఇలాంటి తప్పులు రావడం కొత్తేం కాదని తెలుస్తోంది. గతంలోనూ సినీ నటుడు బాలకృష్ణ పేరును సర్చ్ చేసినప్పుడు ఆయన మరణించినట్లుగా చూపించింది. ‘ఆర్ఆర్ఆర్’ అజయ్ దేవగన్, అలియా భట్, సముద్రఖని తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కీరవాణి సంగీతం అందిస్తోన్న ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది.