భూవివాదం తాతా మనవళ్లను బలితీసుకుంది. ఈ సంఘటన వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం వై శాఖాపూర్ గ్రామంలో జరిగింది. పొలం విషయంలో తలెత్తిన పంచాయితీ వీరి హత్యకు దారి తీసింది. చాలా ఏండ్లుగా దాయాదుల మధ్య భూతగాదాలు కొనసాగుతున్నాయి. పొలం వద్దే పెద్ద మనుషుల మధ్య పంచాయితీ కొనసాగుతుండగా పరశురాములు అనే వ్యక్తి దాయాది గువ్వల పాపయ్య(55) అతడి మనవడు గువ్వల రామకృష్ణ(25)పై కత్తితో దాడి చేశాడు.
ఈ దాడిలో పాపయ్య ఘటనా స్థలిలోనే మరణించాడు. రామకృష్ణను హాస్పిటల్కు తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు. ఈ దారుణానికి ఒడిగట్టిన పరుశరాములును స్థానికులు చితకబాది పోలీసులకు అప్పగించారు. పోలీసులు పరుశురాములుపై కేసు నమోదు చేశారు. ఇద్దరి మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం హాస్పిటల్ కి తరలించారు. తాత మనవళ్ల హత్యతో వై శాఖాపూర్లో విషాద ఛాయలు అమలుకున్నాయి.