Two planes collided in Florida, four dead
mictv telugu

ఫ్లోరిడాలో ఢీకొన్న రెండు విమానాలు..నలుగురు మృతి

March 9, 2023

Two planes collided in Florida, four dead

సెంట్రల్ ఫ్లోరిడాలోని సరస్సుపై రెండు విమానాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. ఈ మేరకు షరీఫ్‌ అధికారులు సమాచారం అందించారు. పోల్క్ కౌంటీ షెరీఫ్ గ్రేడీ జుడ్ మాట్లాడుతూ, వింటర్ హెవెన్‌లోని లేక్ హార్ట్రిడ్జ్ మీదుగా క్రాష్ జరిగిందని, మధ్యాహ్నం 2 గంటలకు పైపర్ J-3 కబ్ సీప్లేన్, చెరోకీ పైపర్ 161 ఫిక్స్‌డ్-వింగ్ ఎయిర్‌క్రాఫ్ట్ ఢీకొన్నాయని చెప్పారు.

ఒక విమానం దాదాపు 21 అడుగుల (6.4 మీ) నీటిలో మునిగిపోయిందని రెస్క్యూ టీం వెల్లడించింది. కాగా, మరొకటి పాక్షికంగా నీట మునిగింది. విమానాల్లోంచి నాలుగు మృతదేహాలను సహాయక సిబ్బంది వెలికితీశారు. రెండు విమానాలు ఢీకొనడానికి గల కారణాలను నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్, ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ దర్యాప్తు చేస్తాయి.

 

సరస్సు ఎగువన ఉన్న ఆకాశంలో రెండు విమానాలు ఒకదానికొకటి ఢీకొని నీటిలో పడ్డాయని ఘటనా స్థలంలో ఉన్న ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఒక విమానం నీటికి ఏడు మీటర్ల దిగువకు చేరుకోగా, మరొకటి తోక నీటి పైన కనిపించింది. విమానాలు ఒకదానికొకటి ఢీకొనడంతో భారీ పేలుడు సంభవించింది. అక్కడున్నదవారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఒకరి మృతదేహాన్ని మాత్రమే స్వాధీనం చేసుకున్నారు.