Two rain bows formed at Buckingham Palace in london
mictv telugu

క్వీన్ ఎలిజబెత్‌కు ప్రకృతి నివాళి.. వింతగా రెండు రెయిన్‌బోలు

September 9, 2022

బ్రిటీష్ మహారాణి ఎలిజబెత్ 2 గురువారం మరణించిన విషయం తెలిసిందే. 70 ఏళ్లకు పైగా పాలించి 96 ఏళ్ల వయసులో కన్నుమూసింది. వేసవి విరామం కోసం స్కాట్లాండ్‌లోని బల్మోరల్ కోటలో వెళ్లి అక్కడే తుది శ్వాస విడిచారు. ఆమె మరణాన్ని బకింగ్ హామ్ ప్యాలెస్ కూడా ధృవీకరించింది. అయితే ఆమె చనిపోయినట్టు ప్రకటించిన తర్వాత ఈ ప్యాలెస్ వద్ద వింత ఘటన చోటుచేసుకుంది. అప్పటికే ప్రజలందరూ గుమిగూడగా అప్పటివరకు వాన పడి చిత్తడిగా ఉండి, తర్వాత ఎండ వచ్చి ప్రశాంతంగా మారింది. ఆ సమయంలో ఒకదానిపై ఒకటి రెండు ఇంద్రధనుస్సులు ఏర్పడ్డాయి. మరణవార్త విని అక్కడకు చేరిన వారంతా దీన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ సందర్భంగా ‘రాణి ఎలిజబెత్‌కు ప్రకృతి కూడా నివాళులిచ్చింది’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. దీంతో ఈ వీడియో నెట్టింట వైరల్ అయింది.