బస్సును ఢీ కొట్టిన తాత్కాలిక డ్రైవర్.. దేహశుద్ధి చేసిన ప్రయాణికులు - MicTv.in - Telugu News
mictv telugu

బస్సును ఢీ కొట్టిన తాత్కాలిక డ్రైవర్.. దేహశుద్ధి చేసిన ప్రయాణికులు

October 14, 2019

RTC Buses .

తాత్కాలిక డ్రైవర్ల అలసత్వం.. అధికారుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో ఓ తాత్కాలిక డ్రైవర్ ముందు వెళ్తున్న మరో బస్సును ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంతో ప్రయాణికులు అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. డ్రైవర్ నిర్లక్ష్యంగా బస్సు నడపడంతో పాటు అతడు మద్యం సేవించి ఉన్నట్టు ప్రయాణికులు గుర్తించారు. వెంటనే అతన్ని పట్టుకొని అక్కడే చితకబాదారు. నడిరోడ్డుపై రెండు బస్సులు ఢీ కొనడంతో వాహనదారులు కూడా భయంతో వణికిపోయారు. దీంతో కూకట్‌పల్లి ఏరియాలో భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోయింది.

వరుసగా జరుగుతున్న పరిణామాలతో తాత్కాలిక ఆర్టీసీ డ్రైవర్ల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తమ ప్రాణాలకు భద్రత లేకుండా పోయిందని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా గత 10 రోజులుగా తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. దీంతో ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ప్రభుత్వం తాత్కాలిక డ్రైవర్లతో వాహనాలు నడుపుతున్నారు. ఈ తరుణంలోనే సరైన అవగాహన లేని డ్రైవర్ల కారణంగ తరుచూ ప్రమాదాలు జరుగుతుండటం గమనార్హం.