ఆంధ్రప్రదేశ్‌లో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. మంగళగిరిలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలోని పుష్కరిణిని అభివృద్ధి చేసే క్రమంలో అందులోని నీళ్లు తోడుతుండగా, ఊహించని విధంగా రెండు శివ లింగాలు బయటపడ్డాయి. ఏళ్ళ క్రితం నాటి లింగాలు బయటపడడంతో ఆలయ పూజారులు పూజలు, పాలాభిషేకాలు నిర్వహిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న చుట్టుపక్కల గ్రామాల ప్రజలు లింగాలను చూసేందుకు భారీగా తరలివస్తున్నారు. దర్శనం కోసం పోటీ పడుతూ ఓం నమశ్శివాయ అంటూ శివ నామ స్మరణ చేస్తున్నారు. ఈ లింగాలు ఏ కాలానికి చెందినవో తెలియాల్సి ఉంది. అటు ఇంకా పుష్కరిణిలో ఇంకా 25 అడుగుల నీరు ఉంది. అవి కూడా తోడేస్తే మరిన్ని శివలింగాలు బయటపడతాయని అర్చకులు చెప్తున్నారు. పుష్కరిణిలో నీళ్లన్నీ తోడిన తర్వాత భక్తులు పూజలు చేసుకునే ఏర్పాట్లు చేస్తామని స్థానిక ప్రజాప్రతినిధులు వెల్లడించారు.