సిక్కులపై దుండగుల కాల్పులు.. పాక్‌లో దారుణం - MicTv.in - Telugu News
mictv telugu

సిక్కులపై దుండగుల కాల్పులు.. పాక్‌లో దారుణం

May 16, 2022


రాజకీయ సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున పాకిస్థాన్‌లో మరోసారి ముస్లింయేతర ప్రజలపై మరోసారి దాడులు జరిగాయి. ఆ దేశంలోని పెషావర్‌లో సిక్కు మైనారిటీలపై దుండగులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. సర్బాంద్ పట్టణంలోని బడా బజార్‌లో దుకాణం నిర్వహిస్తున్న కుల్జీత్ సింగ్ (42), రంజిత్ సింగ్ (38)లపై.. బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపి దారుణంగా హత్య చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న స్థానిక పోలీసులు హంతకుల కోసం గాలిస్తున్నారు. అయితే హత్యకు గల కారణాలేవి అంతుబట్టలేకుండా ఉన్నాయని పోలీసులు పేర్కొన్నారు.

ఖైబర్‌ పఖ్తుంఖ్వా ప్రావిన్సులో జరిగిన ఈ దాడిని పాక్‌ ప్రధాని హెషబాజ్‌ షరీఫ్‌ ఖండించారు. ఈ దారుణానికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయడంతో పాటు వారికి శిక్షపడేలా చూడాలని ఖైబర్‌ పఖ్తుంఖ్వా ముఖ్యమంత్రి మహమ్మూద్‌ ఖాన్‌ను ఆదేశించారు. ప్రధాని ఆదేశాలతో ఇద్దరు సిక్కుల హత్య అనంతరం పెషావర్ లో అల్లర్లు చెలరేగకుండా పోలీసులు పటిష్ట భద్రత చర్యలు తీసుకోవాలని ఖాన్ స్థానిక పోలీసులను ఆదేశించారు. సిక్కుల హత్య బాధాకరమని, హంతకులను వదిలిపెట్టబోమని అన్నారు. ఈ ఘటనపై పాకిస్తాన్ అంతర్గత వ్యవహరాలశాఖ అంసతృప్తి వ్యక్తం చేసింది. మైనారిటీలకు రక్షణ కల్పించడంలో ఖైబర్‌ పఖ్తుంఖ్వా ప్రభుత్వం విఫలమైందని ఆవేదన చెందారు.