50 టన్నుల చెత్త కెలికిన అక్కాచెల్లెళ్లు.. లక్కీగా... - MicTv.in - Telugu News
mictv telugu

50 టన్నుల చెత్త కెలికిన అక్కాచెల్లెళ్లు.. లక్కీగా…

April 21, 2022

vvvvv

పోయిన వస్తువు దొరకాలంటే చాలా కష్టం. ఇది మనందరికీ అనుభవంలోకి వచ్చిన విషయమే. కానీ, ఇద్దరు అక్కాచెల్లెళ్లు  మాత్రం పట్టువిడవకుండా యాభై టన్నుల చెత్త వెతికి మరీ తమ వస్తువును దొరకబుచ్చుకున్నారు.

యూపీకి చెందిన రుచి, అనుష్క అనే ఇద్దరు అక్కాచెల్లెళ్లు చదువుకోవడానికి ఆగ్రా ప్రాంతానికి వచ్చారు. అక్కడే ఓ గది అద్దెకు తీసుకొని రుచి బీఈడీ, అనుష్క బీఎస్సీ తరగతులకు వెళ్తున్నారు. ఈ క్రమంలో ఉదయం నిద్రలేచిన రుచి తన బంగారు చెవి కమ్మలను తీసి ఓ కవర్‌లో పెట్టి దానిని దిండు కింద పెట్టింది. తర్వాత మరచిపోయి అలాగే కాలేజీకి వెళ్లిపోయింది. ఈ విషయం తెలియని అనుష్క దాన్ని తీసి మునిసిపాలిటీ చెత్త వాహనంలో వేసేసింది. సాయంత్రం కాలేజీ నుంచి తిరిగొచ్చిన రుచి అనుష్కను కవర్ గురించి అడిగింది. జరిగింది చెప్పడంతో ఇద్దరూ కలిసి చెత్త డంప్ చేసే ప్రాంతానికి చేరుకున్నారు. ఆరు గంటల పాటు 50 టన్నుల చెత్తను వెలికితీసి పోగొట్టుకున్న కవరును గుర్తించారు. బంగారు ఆభరణాలు భద్రంగా ఉండడంతో అక్కాచెల్లెలు ఊపిరి పీల్చుకున్నారు.