అదృష్టాన్ని పరీక్షించుకుందామని లాటరీ టికెట్ కొన్నారు.. జాక్‌పాట్‌ కొట్టారు - MicTv.in - Telugu News
mictv telugu

అదృష్టాన్ని పరీక్షించుకుందామని లాటరీ టికెట్ కొన్నారు.. జాక్‌పాట్‌ కొట్టారు

May 31, 2022

అదృష్ట లక్ష్మి ఎప్పుడూ ఎలా ఎవరి తలుపు తడుతుందో ఎవరూ ఊహించలేరు. తాజాగా అలాంటి ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. తమిళనాడులోని కన్యాకుమారికి చెందిన డా.ఎం ప్రదీప్, అతని బంధువు ఎన్ రమేశ్కు కేరళలో రూ.10కోట్ల లాటరీ తగిలింది. తమిళనాడు వాసులకు కేరళలో లాటరీ ఎలా తగిలిందనే కదా అనుమానం. వీళ్లిద్దరూ కొద్ది రోజుల క్రితం విదేశం నుంచి వచ్చిన తమ బంధువును ఇంటికి తీసుకువచ్చేందుకు కేరళలోని తిరువనంతపురం విమానాశ్రయానికి వెళ్లారట. ఆ సమయంలో కేరళ విషు బంపర్ లాటరీ టికెట్ నడుస్తోందట. ఆ క్రమంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఇద్దరూ ఓ ఏజెంట్‌ వద్ద లాటరీ టికెట్‌ను కొనుగోలు చేశారు. ఇక, ఈ నెల 15వ తేదీన లాటరీ డ్రాలో ఊహించని రీతిలో వీరిద్దరికి జాక్‌పాట్‌ తగిలింది. డ్రాలో వీరి టికెట్‌కు రూ.10కోట్ల లాటరీ తగిలింది. ఈ క్రమంలోనే లాటరీ నిర్వాహకులు వీరిని విజేతలుగా ప్రకటించారు. దీంతో వారు సోమవారం లాటరీ భవన్కు వెళ్లి టికెట్తో పాటు అవసరమైన పత్రాలు సమర్పించి రూ.10 కోట్లు తీసుకెళ్లారు.