ములుగు జిల్లాలో ఇద్దరు ఉపాధ్యాయలు మధ్య వివాహేతర సంబంధం బట్టబయలైంది. స్కూళ్లో పిల్లలకు విద్యాబుద్ధుల నేర్పాల్సింది పోయి.. పనికిమాలిన పనులకు పాల్పడుతున్న వారిద్దరిని ఉపాధ్యాయురాలి భర్త రెడ్ హ్యాండెడ్‌గా పటుకున్నాడు. గ్రామంలో తాళ్ళుతో కట్టి కొట్టుకుంటూ ఊరేగించాడు.
మంగపేటలో ఇద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయుల గత కొంతకాలంగా సన్నిహితంగా మెలుగుతున్నారు. ఈ విషయంపై ఉపాధ్యాయురాలి భర్త పలుమార్లు హెచ్చరించి..పై అధికారులకు ఫిర్యాదు చేశాడు. అయిన వారిద్దరిలో మార్పు రాలేదు. సీక్రెట్‌గా ఉపాధ్యాయురాలి ఇంటిలో కలుస్తూ వస్తున్నారు. ఆమె భర్త ఏఆర్ కానిస్టేబుల్‌గా వేరే చోట విధులు నిర్వర్తిస్తుండడంతో వీరి ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. ఈ క్రమంలోనే ఉపాధ్యాయుడు నాగేందర్.. ఉపాధ్యాయురాలికి ఫోన్ చేసి ఇంటికి వస్తున్న తలుపు తీసి ఉంచు చెప్పాడు. అయితే ఆ ఫోన్‌ను ఉపాధ్యాయురాలి భర్త ఎత్తడంతో విషయం అర్థమైంది
దీంతో భర్త తలుపు తీసి బాత్ రూంలో దాక్కున్నాడు. నాగేందర్ ఇంటికి రాగానే గడియ పెట్టి గొడవకు దిగాడు. అయితే నిద్ర నుంచి లేచిన భార్య, నాగేందర్ తిరిగి భర్తపై ఎదురుతిరిగారు. అనంతరం ఆయన తన బంధుమిత్రులకు సమాచారం అందించాడు. వారిద్దరికి దేహశుద్ధి చేసి తాళ్లతో కట్టేశారు. అనంతరం మంగపేట పోలీసులకు అప్పగించారు. వివాహేతర సంబంధం విషయమై గతంలో పలుమార్లు మందలించినా తీరు మారలేదని ఉపాధ్యాయిని భర్త, అతని బంధువులు తెలిపారు. ఈ వ్యవహారం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.ఉపాధ్యాయురాలికి ఓ పాప ఉండగా, ఉపాధ్యాయుడు నాగేందర్ రెండు పెళ్లిళ్లు చేసుకొని వారిద్దరిని వదిలేశాడు.